Wednesday, 25 November 2020

మళ్లీ మొదలెట్టిన మోహన్ బాబు.. మంచు గ్రూపులో రకుల్ ప్రీత్ కూడా!

చాలా రోజుల త‌ర్వాత మరోసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్‌లో దేశభక్తి ప్రధానాంశంగా '' ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రయూనిట్.. ఇటీవలే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో కంప్లీట్ చేయనున్నారు. ఈ మూవీలో మోహన్ బాబు రోల్ గతంలో ఎన్నడూ చుడనివిధంగా ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇకపోతే ఈ మూవీ ఓ కీలక పాత్ర కోసం యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకున్నారని సమాచారం. మోహన్ బాబు లాంటి బడా హీరో సినిమాలో ఛాన్స్ అనేసరికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వెంటనే రెడీ అనేసిందట రకుల్. అతిత్వరలో ఈ బ్యూటీ 'స‌న్ ఆఫ్ ఇండియా' సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. Also Read: మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం విశేషం. అశోక్‌తేజ పాట‌లు రాస్తుండ‌గా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదివకెన్నడూ కనిపించని అత్యంత శక్తిమంతమైన పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారని.. ఈ తరహా కథ కానీ, ఇలాంటి జానర్‌ సినిమా కానీ ఇప్పటివరకు తెలుగులో రాలేదని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/363kaT4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...