Tuesday, 3 November 2020

ఆ ఆశతోనైనా బతుకుతా అన్న: వీరాభిమానికి ఎన్టీఆర్ హామీ.. త్వరలోనే కలుస్తా!

సినిమా హీరోలకు అభిమానులే బలం, బలహీనత. తమ హీరో సినిమా వచ్చినా, ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టినా అభిమానులంతా ఒక్కటై విజయవంతం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. తమ హీరోకు అండగా నిలుస్తారు. తోడబుట్టకపోయినా తమ అభిమాన హీరోను సోదరుడిగా భావిస్తారు. హీరోలూ అంతే.. అభిమానులను అన్నదమ్ముళ్లా చూస్తారు. వాళ్లకు ఏమైనా జరిగితే తల్లడిల్లిపోతారు. ఏ అభిమాని అయినా ఆపదలో ఉన్నట్టు తెలిస్తే అతడికి ఏదో రకంగా సాయం చేస్తారు. ఇప్పటి వరకు తెలుగు హీరోలు తమ అభిమానులను ఆదుకున్న సంఘటనలు ఎన్నో చూశాం. అలాగే, కదలలేని పరిస్థితుల్లో ఉండి తమ అభిమాన హీరోను చూడాలనే ఆశపడిన చాలా మంది అభిమానుల కోరికలను మన హీరోలు తీర్చారు. అలాంటి హీరోల్లో యంగ్ టైగర్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన కదలలేని పరిస్థితిలో ఉన్న ఓ అభిమానితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అతనికి ధైర్యం చెప్పారు. Also Read: వెంకన్న అనే ఎన్టీఆర్ వీరాభిమాని కండరాల బలహీనత కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఎన్టీఆర్‌ను ఎలాగైనా కలిసి ఆయనతో సెల్ఫీ దిగాలన్నది వెంకన్న కోరిక. ఈ విషయాన్ని అభిమానులు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా వెంకన్నతో మాట్లాడారు. త్వరలోనే కలుస్తానని వెంకన్నకు హామీ ఇచ్చారు. కొవిడ్ పరిస్థితి చక్కబడగానే తన దగ్గరకు పిలుపించుకుని ఒక మంచి ఫొటో దిగుతానని వెంకన్నకు ఎన్టీఆర్ చెప్పారు. మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్‌తో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిన వెంకన్న చాలా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మిమ్మల్ని కలవాలనే ఆశతోనైనా బతుకుతా అన్న. మిమ్మల్ని కలిసేంత వరకు బతుకుతా’’ అని వెంకన్న ఎమోషన్ అయ్యారు. వెంటనే ఎన్టీఆర్ అందుకుని.. ‘‘నువ్వెక్కడికి వెళ్తావ్. నీకేం కాదు. నీకూ ఏం కాదు.. నాకూ ఏం కాదు. అందరం ఇక్కడే ఉంటాం. నువ్వు మాత్రం మంచి ఆహారం తీసుకో, బాగా రెస్ట్ తీసుకో, అమ్మను బాగా చూసుకో’’ అని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eqdKjA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...