కరోనా కారణంగా ప్రజల జీవన వ్యవస్థ అతలాకుతలమైంది. వైరస్ ఉదృతి కారణంగా అవుట్‌సైడ్ ఫుడ్ తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటి ఫుడ్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తన ఇద్దరు మనవరాళ్లు సంహిత, నివ్రితిలతో కలిసి కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ చేశారు. మనవరాళ్లతో కలిసి వంట చేయడం సరదాగా అనిపించిందని అన్నారు. తాను చికెన్ రెడీ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ''రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే.. ఆ కిక్కే వేరప్పా'' అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అమ్మకోసం ఇలాగే దోశ వేసిన చిరంజీవి ఇప్పుడు మానవరాళ్ల కోసం చికెన్ రెడీ చేశారు. మరోవైపు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్లాస్మా దానం వంటి విషయాల గురించి చెబుతూనే తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని సందర్భాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చిరంజీవి. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కీలకపాత్ర పోషించనున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండనుందని టాక్. ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ 152వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oP04Dc
v
No comments:
Post a Comment