Thursday, 26 November 2020

సుకుమార్ క్రేజీ ప్లాన్... ‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లట!

అల్లు అర్జున్, డైరెక్షన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ సందర్భంగా బన్నీ గెటప్‌కు సంబంధించి ఇటీవల లీకైన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా తొమ్మిది మంది విలన్లను సెట్ చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఇప్పటివరకు అనేక సినిమాల్లో విలన్లుగా ముఖేశ్ రుషి, రావు రమేష్‌లతో పాటు ప్రముఖ విలన్లు ఇందులో కనిపించనున్నారట. ఈ తొమ్మిది మందిలో సునీల్‌కి కూడా రోల్ దొరికినట్లు సమాచారం. హాస్యనటుడి నుంచి హీరోగా మారిన సునీల్.. ఇటీవల విలన్‌ రోల్స్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘డిస్కో రాజా’లో నెగిటివ్ టచ్‌ పాత్రలో కనిపించినా సునీల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇటీవలే వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ కోసం సుకుమార్‌ భారీగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l9dYx9
v

No comments:

Post a Comment