మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. చిరంజీవి నవంబర్ 20 నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఆయన సినిమాకు కీలకమైన సన్నివేశాల్లో నటించబోతున్నారు. అయితే, ఈ షెడ్యూల్‌లోనే సినిమాలో విలన్ పాత్రధారి కూడా జాయిన్ కాబోతున్నారని సమాచారం. ‘ఆచార్య’లో ప్రముఖ నటుడు సోనూ సూద్ నటిస్తు్న్నారని ఇప్పటికే బయటికి వచ్చింది. అయితే, ఆయన విలన్ పాత్ర చేయడం లేదట. ఆయన పాత్ర సినిమాకు కీలకమే అయినా అది నెగిటివ్ రోల్ కాదని అంటున్నారు. అయితే, విలన్ పాత్ర కోసం తమిళ నటుడు అరవింద్ స్వామిని ఎంపిక చేసుకున్నారట మేకర్స్. ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్‌కు విలన్‌గా నటించిన హ్యాండ్‌సమ్ హీరో అరవింద్ స్వామి.. ఇప్పుడు మెగాస్టార్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. మరోవైపు, రామ్ చరణ్ సైతం ‘ఆచార్య’లో ఓ అతిథి పాత్ర చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఆమె కూడా తన హనీమూన్ ట్రిప్‌ను ముగించుకుని డిసెంబర్ 5 నుంచి ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. కాగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lLFRfD
v
No comments:
Post a Comment