Wednesday, 25 November 2020

కంట్రోల్ యువర్ టంగ్: కోటాపై బాబూమోహన్ సీరియస్.. కోట రివర్స్ పంచ్

కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌ కాంబినేషన్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పటికీ టీవీలో వీరిద్దరి కాంబినేషన్‌లో సీన్స్ వస్తే కళ్లార్పకుండా చూస్తారు చాలా మంది.‌ వీరి‌ద్దరూ ఎన్నో సిని‌మాల్లో జాయింటుగా నటించి నవ్వించారు. ఎన్ని సినిమాల్లో చూసినా బోర్ కొట్టలేదు. ప్రతి సినిమాలోనూ ఈ కాంబో కొత్తగానే అనిపించింది. అంతలా వీరిద్దరూ నవ్వులు పంచారు.‌ బాబూమోహన్‌ వంగడం, కోట తన్నడం,‌ ప్రేక్షకులు నవ్వు‌కో‌వడం.‌.‌ ప్రతీ సిని‌మా‌లోనూ ఇదే తంతు. అయితే, ఈ కాంబోను మళ్లీ తెరపై కొన్ని సంవత్సరాలు అవుతోంది. బాబూమోహన్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక కోట శ్రీనివాసరావు తన వయసుకు తగ్గట్టుగా విలన్, తండ్రి, తాత పాత్రలు వేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో ఎక్కువగా నటించలేకపోతున్నారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే, సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ కోట, బాబూమోహన్ కాంబో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తోంది. దీనికి కార్యక్రమం వేదికైంది. Also Read: ఆలీతో సరదాగా నవంబర్ 30 ఎపిసోడ్‌లో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. కోట శ్రీనివాసరావు సీరియస్‌గా బాబూమోహన్‌పై పంచ్‌లు వేస్తూ నవ్వించారు. ప్రోమోనే ఇంత ఫన్నీగా ఉంటే ఎపిసోడ్ మొత్తం ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. ప్రోమో ప్రారంభంలోనే కోట తన చమత్కారాన్ని మొదలుపెట్టేశారు. ‘‘వెల్‌కమ్ టు బాబాయ్.. ఆలీతో సరదాగా మై షో’’ అని ఆలీ అనగానే.. ‘‘బాబాయ్ ఏంటయ్యా ఇంటర్వ్యూకి పిలిచి. గౌరవం ఉండక్కర్లా?’’ అని పంచ్ వేసేశారు కోట. దీంతో కోట శ్రీనివాసరావు గారు నమస్కారం, బాబూమోహన్‌ గారు నమస్కారం అని సరిదిద్దుకున్నారు ఆలీ. ఇప్పుడు బాబూమోహన్ టైం వచ్చింది. ‘‘నమస్కారం చెప్పం.. మేం ఇట్టా అంటాం’’ అని రాజకీయ నాయకులు చేయి ఊపే పద్ధతిని బాబూమోహన్ చూపించారు. దానికి కోట పంచ్ వేసేశారు. ‘‘ఎవరైనా పలకరిస్తే ఇట్టిట్టా (హాయ్ చెబుతున్నట్టు చేయి ఊపుతూ) అంటున్నారు. నాకేమో బ్యాడ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు కాదు తరవాత మాట్లాడదాం అన్నట్టు ఉంది’’ అని అన్నారు కోట. Also Read: ఆలీకి కోట ఏదో చెప్పబోతూ.. ‘‘ఒకప్పుడు మీకూ తెలుసుంటుంది ఆలీగారూ’’ అన్నారు. దీనికి.. ‘‘చెప్పండి కోట గారూ’’ అని అన్నారు ఆలీ. ‘‘లేకపోతే ఏమంటాం.. చెప్పరా అంటామా’’ అని సీరియస్‌గా అన్నారు కోట. ‘‘చెప్పవయ్యా ఏంటో..’’ అని ఆలీ రిప్లై ఇచ్చారు. ‘‘నువ్వు ఉండవయ్యా.. ఊరికేను’’ అని కోట మళ్లీ వేశారు. దీంతో ఆలీ నవ్వు అందుకున్నారు. ఆ వెంటనే బాబూమోహన్.. ‘‘కంట్రోల్ యువర్ టంగ్ అన్న’’ అని సీరియస్‌గా అన్నారు. దానికి కోట మళ్లీ పంచ్ వేశారు. ‘‘కంట్రోల్ ఉన్నాను కాబట్టే ఇలా ఉంది. లేదంటే నీ మొహాన పడేది’’ అని బాబూమోహన్‌కు రిప్లై ఇచ్చారు. ఇలా ప్రోమో అంతా నవ్వులే నవ్వులు. ( )


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JbYD1V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...