Wednesday, 18 November 2020

జాంబీ రెడ్డి: డబ్బింగ్ మొదలెట్టిన తేజ.. అలా పూర్తిచేసిన తొలి చిత్రమిదే!

‘ఆ!’, ‘కల్కి’ చిత్రాల తరవాత ప్రశాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తోన్న మూడో సినిమా ‘’. బాల‌న‌టుడిగా ప్రేక్షకుల విశేష ఆద‌రాభిమానాలు పొంది, ‘ఓ బేబీ’ చిత్రంలో టీనేజ్ కుర్రాడిగా కనిపించి ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ఈ చిత్రానికి సంబంధించి డ‌బ్బింగ్ పనులు మొద‌లయ్యాయి. మొద‌ట‌గా హీరో తేజ స‌జ్జా త‌న పాత్రకు డ‌బ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్టర్లకూ, మోష‌న్ పోస్టర్‌కూ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వర‌లో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, లాక్‌డౌన్ స‌డ‌లించాక ప్రభుత్వ నిబంధ‌న‌ల మేర‌కు టాలీవుడ్‌లో షూటింగ్ పున‌రుద్ధరించి, పూర్తి చేసిన తొలి చిత్రం ఇదే. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అంద‌రి స‌హ‌కారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీక‌ర‌ణ పూర్తి చేశామ‌నీ, ఇందుకు వారికి థాంక్స్ చెప్పుకుంటున్నామ‌నీ ద‌ర్శక నిర్మాత‌లు తెలిపారు. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా.. అనిత్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి బాబా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kEOPdy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...