Wednesday, 18 November 2020

‘వేదాళం’ రీమేక్... చిరంజీవికి షాకింగ్ రెమ్యునరేషన్!

మెగాస్టార్ దూకుడు మీదున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’లో నటిస్తున్న ఆయన ఆ తర్వాత రెండు, మూడు రీమేక్‌ సినిమాలను లైన్లో పెట్టారు. టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఉన్న చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. ‘ఆచార్య’ కోసం ఆయన ఏకంగా రూ.50కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇందులో ఆయన తనయుడు రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్‌రెడ్డితో కలిసి చరణ్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ పూర్తికాగానే చిరు ‘వేదాళం’ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని దర్శకుడు మెహర్ రమేష్‌కి చెప్పారట. తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ అక్కడ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ అనేక మార్పులు చేశారట. ఇందులో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం చిరంజీవి ఈ సినిమా కోసం ఏకంగా రూ.60కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాస్ సినిమా అంటే బాక్సాఫీస్ కళకళ్లాడటం ఖాయం. దీంతో ఆయన ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు. ఈ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ సుంకర కూడా చిరంజీవి రూ.60కోట్లు అడిగితే కాదనకుండా ఒప్పేసుకున్నారంట. ఈ ప్రచారంపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UHiIz6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...