Sunday, 22 November 2020

దుస్తులు మార్చుకుంటా అన్నా వినలేదు.. క్యారీవాన్‌లోకి వచ్చి! నిర్మాతపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఇప్పటికే ఎందరో నటీమణులు నోరు విప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇరానీ నటి ఓ నిర్మాత బండారం బయటపెడుతూ సంచలన కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ ఓపెన్ అయింది. తనపై నిర్మాత ప్రవర్తించిన తీరు బాధపెట్టిందని, ఆయన మానసికంగా వేధించాడని చెబుతూ ఆవేదన చెందింది. శృంగార తార సన్నీలియోన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ‘కోకో కోలా’ చిత్రంలో ప్రస్తుతం మందనా కరీమి నటిస్తోంది. అయితే అదే చిత్ర నిర్మాత తనను మానసిక వేధింపులకు గురిచేశాడని ఆమె చెప్పడం బీ టౌన్ వర్గాల్లో సంచలనంగా మారింది. గతేడాది నుంచి ‘కోకో కోలా’ సినిమా షూటింగ్‌ జరుగుతోందని, ఈ చిత్ర నిర్మాత సహా యూనిట్ మొత్తానితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని మందనా పేర్కొంది. Also Read: కాల్ షీట్స్ ప్రకారం దీపావళి ముందురోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి తన షూటింగ్‌ చివరి రోజు అని, అయితే అదే రోజు నిర్మాత ప్రవర్తన చూసి చాలా బాధేసిందని మందనా కరీమి తెలిపింది. ''సినిమాలో ఇంకొన్ని బ్యాలెన్స్‌ ఉన్నాయని.. కాబట్టి మరో గంట సెట్‌లోనే ఉండాలని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో నాకు వేరే మీటింగ్స్ ఉండటంతో కుదరదని చెప్పి క్యారీవాన్‌లోకి వచ్చి డ్రెస్ మార్చుకుంటున్నా. దీంతో ఆ నిర్మాత నేరుగా క్యారీవాన్‌లోకి వచ్చేయడమే గాక అనరాని మాటలు అన్నాడు. డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చి మాట్లాడతా అని చెప్పినా పట్టించుకోకుండా దూషించాడు'' అని ఆమె చెప్పుకొచ్చింది. మహేంద్ర ధరివాల్ పురుష పక్షపాతి అని ఆమె పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IVXiM9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...