Tuesday, 24 November 2020

పవన్-క్రిష్ మూవీలో సాయిపల్లవి.. రోల్ అదిరిపోతుందట!

పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘వకీల్ సాబ్’ షూటింగులో పాల్గొంటున్న ఆయన క్రిష్‌తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో మొదటి హీరోయిన్‌గా ‘సాహో’ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది. Also Read: మరో హీరోయిన్‌ కోసం యూనిట్‌ జల్లెడ పడుతుండగా నిధి అగర్వాల్ పేరు బయటికి వచ్చింది. తాజాగా పేరు కూడా వినిపస్తోంది. జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ నిలుస్తుందని, అందువల్ల సాయిపల్లవి అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్‌మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nViOzI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...