Saturday, 7 November 2020

నాగశౌర్య మరో అడుగు.. ఐరా సినిమాస్ పేరుతో నూతన బ్యానర్ స్టార్ట్

నాగ‌శౌర్య హీరోగా ''ఛ‌లో, అశ్వ‌థ్థామ'' లాంటి సూప‌ర్ హిట్ సినిమాలను నిర్మించిన ఆయన సొంత బ్యానర్ ఐరా క్రియేష‌న్స్ నుంచి సోద‌ర సంస్థ‌గా మరో బ్యానర్ ఐరా సినిమాస్‌ని ప్రారంభించారు. తాజాగా ఈ బ్యానర్ నుంచి తొలి మూవీ స్టార్ట్ చేశారు. నేడు (నవంబర్ 7) హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో నిర్మిస్తోన్న తొలి చిత్ర ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి న‌టుడు, వ్యాపార‌వేత్త, ఏఎస్‌పీ మీడియా హౌస్‌ అధినేత అభిన‌వ్ స‌ర్దార్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. న‌వంబ‌ర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంక‌ర్‌ప్ర‌సాద్ ముల్పూరి మాట్లాడుతూ.. "ఇవాళ మంచిరోజు కావ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేష‌న్స్‌కు సోద‌ర సంస్థ‌. యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో బ్యాన‌ర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తాం. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్ల‌ర్" అని చెప్పారు. Also Read: ఔత్సాహిక న‌టులు, ద‌ర్శ‌కుల‌తో కంటెంట్ ప్ర‌ధాన చిత్రాల‌ను నిర్మించ‌డం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ముఖ్య ఉద్దేశం. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టాల‌ని క‌ల‌లు క‌నే నూత‌న‌ న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p8qXCz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...