మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. అజానుబాహుడు, పైగా అందగాడు కావడంతో తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. అందుకే మాస్ సినిమాలు కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ముకుంద, కంచె, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్2, గద్దలకొండ గణేష్.. చిత్రాలు ఆయనలోని నటుడిని మరింత రాటుదేలేలా చేశాయి. Also Read: ఎఫ్2లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన చేసిన కామెడీని ప్రేక్షకులు మరిచిపోకముందే ‘గద్దలకొండ గణేష్’లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. అయితే ‘ఎఫ్2’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఎఫ్3’లో నటించేందుకు నిర్మాత దిల్ రాజు సంప్రదించగా షాకిచ్చాడట. భారీస్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దిల్ రాజుకి ఏం చేయాలో తెలీక వెళ్లిపోయారట. అయితే వరుస విజయాలతో వరుణ్ ఇమేజ్ బాగా పెరిగిందని, అందువల్లే పారితోషికం పెంచాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిలో నిజమెంత ఉందో తెలియాలంటే వేచి చూడాలి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nZflQW
v
No comments:
Post a Comment