Monday, 23 November 2020

‘పుష్ప’ నుంచి విజయ్ ఔట్... లైన్లోకి వచ్చిన అపరిచితుడు?

స్టైలిష్ స్టార్ , సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. రష్మిక మందానా హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. Also Read: దీంతో ఆ పాత్ర పోషించే నటుడి కోసం యూనిట్ మళ్లీ జల్లెడ పడుతోంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర, సుదీప్‌, ఆర్య వంటి వారి పేర్లు వినిపించినా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు విక్రమ్‌ను సంప్రదిస్తున్నట్లుగా ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుల్లో ముందు వరుసలో ఉంటారాయన. ఈ సినిమాలో నిజంగానే విక్రమ్‌ని తీసుకుంటే ‘పుష్ప’ రేంజ్ మరింత పెరగడం ఖాయమని సినీవర్గాలు అంటున్నాయి. దీనిపై యూనిట్ స్పందించాల్సి ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2URUzGg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...