మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. కుమార్తు డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో తలమునకలై ఉంది. అయితే నాగబాబు తన కాబోయే అల్లుడు చైతన్యకు ముట్టజెబుతున్న లాంఛనాలపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగబాబు తన అల్లుడికి సుమారు రూ.10కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక నగల కోసం మరో రూ.2కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు నిహారిక పేరు మీద ఉన్న బంగ్లాను కూడా అల్లుడికే ఇచ్చేస్తున్నారట. Also Read: సెలబ్రెటీల కుటుంబాల్లో పెళ్లంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటారని అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన సెలబ్రెటీల ఇళ్లల్లో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే నాగబాబు చేసేది తక్కువే అయినప్పటికీ.. కూతురికి ఎలాంటి లోటు లేకుండా, ఎవరితోనూ మాట పడకుండా నాగబాబు ఘనంగానే ఏర్పాట్లు చేస్తున్నారట. సెలబ్రెటీల ఇంట వివాహాలు జరిగినప్పుడు లాంఛనాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు ఎంత ఇస్తున్నారు.. అవతలి వాళ్లు ఎంత పుచ్చుకుంటున్నారన్నది వాళ్లకే తెలియాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2INW0Tm
v
No comments:
Post a Comment