Thursday, 26 November 2020

‘ఆ విషయం నీకు అర్ధం కావడం లేదు’... నెటిజన్‌ కామెంట్‌పై తాప్సీ ఫైర్

‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పన్ను చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్‌కు గుడ్‌ బై చెప్పేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ రెండు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ‘రష్మీ రాకెట్’ సినిమాలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌ని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Also Read: అయితే ఈ పోస్టర్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే అసభ్య పదజాలంతో కామెంట్ చేయడంతో తాప్సీకి కోపమొచ్చింది. ‘నీకు నటన రాదు. మంచి కథలు ఎంచుకుంటూనే వాటిని నాశనం చేస్తున్నావ్. ఫాల్తు హీరోయిన్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై ఘాటుగా స్పందించిన తాప్సీ.. ‘నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించాను. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JiJ3RB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...