Sunday, 22 November 2020

ఆ హీరోకు ఆడోళ్ల పిచ్చి... జయమాలిని నన్ను వాటేసుకుంది: విజయ రంగరాజు

నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన భైరవద్వీపం గుర్తుందా.. అందులో భైరవుడిగా నటించి అందరినీ మెప్పించారు విజ‌య రంగ‌రాజు. అయితే ఆ సినిమాతో పేరుచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత గోపీచంద్ ‘య‌జ్ఞం’లో నాయుడమ్మగా మెప్పించిన తర్వాతే ఆయనకు కాస్తోకూస్తో అవకాశాలు పెరిగాయి. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయనకు సరైన పాత్ర పడితే చాటు చెలరేగిపోతారు. అయితే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆయన యూట్యూబ్ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజ‌య రంగ‌రాజు. విష్ణువర్ధన్‌కు బాగా పొగరెక్కువని, లేడీస్ వీక్‌నెస్‌ కూడా ఉందని తెలిపారు. హీరోయిన్లు తన ఎదుటే మరెవరితోనైనా ఆయన సహించలేకపోయేవారని షాకింగ్ విషయం చెప్పారు. ‘ఓ సారి విష్ణువర్ణన్‌ సినిమాలో జయమాలిని నటిస్తోందని తెలిసి లొకేషన్‌కు వెళ్లాను. ఇద్దరికీ చనువు ఉండటంతో ఆమె నన్ను వెనుక నుంచి వాటేసుకుంది. మమ్మల్ని దూరం నుంచి చూసిన విష్ణువర్థన్ అసూయతో మా ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు’ అని తెలిపారు. Also Read: తనకు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు ఓ మధ్యవర్తి ద్వారా జయమాలిని సంబంధం వచ్చిందని విజయ్ రంగరాజు తెలిపారు. కొన్ని కారణాల వల్ల సంబంధం కుదరలేదని, అయినప్పటికీ ఎక్కడ కలిసినా జయమాలిన తనతో ఆప్యాయంగా మాట్లాడేవారని వెల్లడించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36XJp8z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...