Sunday, 1 November 2020

‘వకీల్ సాబ్’ సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. లీక్ చేస్తే ఏడాది జైలు శిక్ష!

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సుమారు ఎనిమిది నెలలు విరామం తీసుకున్న పవర్ స్టార్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ఆదివారం ఆయన ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే, ‘వకీల్ సాబ్’కు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వకీల్ సాబ్’ షూటింగ్ మొదలైన మొదటి రోజే పవన్ కళ్యాణ్ పిక్స్ కొన్ని లీకైన సంగతి తెలిసిందే. వీటి వల్ల పవన్ కళ్యాణ్ లుక్ బయటికి వచ్చేసినట్టు అయ్యింది. దీనిపై అప్పట్లోనే నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్ చిత్రీకరిస్తున్నారు కాబట్టి అవి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దిల్ రాజు. See Photos: ‘వకీల్ సాబ్’ పిక్స్, వీడియోలను లీక్ చేసినా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసినట్టు పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ లీక్డ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మెగా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే, ‘వకీల్ సాబ్’ టీజర్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే వచ్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Also Read: హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. అలాగే, తాప్సి పాత్రలో నివేదా థామస్ నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ కొనుగోలు చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TMb8mg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...