మన దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేగం పుంజుకుంది. ప్రేక్షకులు సినిమాల కంటే వెబ్ సిరీసులు చూడటానికే ప్రాధాన్యత ఇవ్వడంతో సినీతారలు సైతం వాటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఈ మార్గం వైపు వస్తున్నారు. గ్రీక్ గాడ్‌గా అభిమానులతో ముద్దుగా పిలిపించుకునే హీరో హృతిక్ రోషన్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ప్లాన్ చేస్తోందని, ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ వెబ్ సిరీస్ కోసం హృతిక్‌కు ఏకంగా రూ.90కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. ఇందులో దిశా పటానీ కూడా నటించనున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు ఇస్తుంటే మిగతా స్టార్ హీరోలందరూ కూడా ఓటీటీ బాట పడతారేమో..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pS2WA0
v
No comments:
Post a Comment