Saturday, 7 November 2020

హనీమూన్‌కు రెడీ అవుతున్న కాజల్ దంపతులు

కుటుంబసభ్యుల సమక్షంలో ప్రియుడి గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ కాజల్. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకుని ఆ తర్వాత కాజల్ తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొంటుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ యూనిట్‌తో మరో వారంలో జాయిన్ అవుతుందని, దాని తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది . ప్రస్తుతానికి షూటింగుల పని పక్కనపెట్టి ముందు భర్తతో హనీమూన్‌కి వెళ్తోంది కాజల్. ఈ విషయాన్ని కాజల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. తమ పేరుతో ఉన్న పౌచ్‌లతో పాటు పాస్‌పోర్టులను పిక్ తీసి... బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో అంటూ కామెంట్ చేసింది. అయితే హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నామన్నది మాత్రం వెళ్లడించలేదు. కాజల్ పోస్ట్‌కి స్పందిస్తున్న నెటిజన్లు.. హ్యాపీ జర్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eytwsy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...