Thursday, 19 November 2020

తొలి సినిమా రిలీజ్ కాకుండానే.. రెమ్యునరేషన్ పెంచేసిన యంగ్ బ్యూటీ

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందరూ డబ్బు కంటే అక్కడ నిలదొక్కుకునేందుకు ప్రాధానత్య ఇస్తారు. అందుకే తొలినాళ్లలో రెమ్యునరేషన్ నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి సరైన హిట్ పడిదంటే చాలు రేటు పెంచేస్తారు. ఈ విషయంలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. అయితే గతంలో హీరోయిన్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉండేవారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇటీవల రెమ్యునరేషన్లలో కోత విధించుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించారు. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు పారితోషికం విషయంలో తగ్గడం లేదంట. Also Read: ఈ కోవలోనే ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాని యంగ్ హీరోయిన్ ఏకంగా రూ.70లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. మెగా హీరో హీరోగా నటించిన ‘’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతి శెట్టి. ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే వీడియో సాంగ్ రిలీజైనప్పుడు తన లుక్స్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆమె క్యూట్ లుక్స్‌కి యూత్ ఫిదా అయిపోవడంతో ఆ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. కరోనా కారణంగా ఆమె నటించిన ‘ఉప్పెన’ ఇంకా థియేటర్లలో విడుదల కాలేకపోయినా ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇప్పటికే నాని సినిమాలో ఛాన్స్ దక్కించుకోగా.. ఇంకా చాలామంది యంగ్ హీరోలు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం పోటీ పడుతున్నారట. దీన్ని అవకాశంగా తీసుకున్న కృతి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఫాలో అయిపోతోందట. రూ.70లక్షలిస్తేనే నటిస్తానని చెప్పడంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట. అయితే తెలుగులో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల కొరత ఉండటంతో ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు కొందరు సై అంటున్నట్లు టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35Rps49
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...