టెక్నాలజీ వేగాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది అక్కినేని కోడలు . పెళ్లి తర్వాత కూడా రెగ్యులర్‌గా వెండితెరపై అలరిస్తూ ట్రెండ్‌కి తగ్గట్టుగా ముందుకు సాగుతోంది. ఈ రోజుల్లోని ప్రేక్షకులు కోరుకునే విధంగా వినోదాన్ని పంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పి కెమెరాల ముందు కదులుతున్న సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఆమె కోసం అల్లు అరవింద్ పక్కా ప్లాన్ చేశారని టాక్. ఇటీవలే బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెరపై సందడి చేసి అందరిచేత భేష్ అనిపించుకుంది సమంత. మామ నాగార్జున స్థానాన్ని భర్తీ చేస్తూ దసరా స్పెషల్ ఎపిసోడ్ బాధత్యలు భుజాన వేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో హోస్ట్‌గా సమంత వ్యవహరించిన తీరు విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక భారీ టీఆర్ఫీ సంపాదించి ఆమె సత్తా ఏంటో తెలియజేసింది. దీంతో ఇదే జోష్‌లో త్వరలో 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై ఓ టాక్ షో చేయడానికి రెడీ అయిందట సమంత. Also Read: ఈ రియాలిటీ షోని సమంత ఒప్పుకోవడానికి కారణం బడా నిర్మాత, ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్ అని సమాచారం. ఆమె చేయబోయే ఈ షో కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారట అల్లు అరవింద్. మరోవైపు ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి అరచేతిలో ఆటలాడుతూ మెప్పించడానికి ఇదే బెస్ట్ రూట్ అని ఫిక్సయిన సామ్.. ఈ షోలో చేయడానికి ఉత్సాహంగా ఉందట. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు గెస్టులుగా తీసుకొచ్చి, సరదా సరదా ముచ్చట్లతో ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోతూ అందరినీ ఆకట్టుకునేలా ఈ షోని పక్కాగా ప్లాన్ చేశారట. ఇందుకోసం సమంతకు భారీగా రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారనేది ఫిలిం నగర్ టాక్. అతిత్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eDU7Vi
v
No comments:
Post a Comment