Wednesday, 4 November 2020

లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుకు నో చెప్పిన సాయిపల్లవి?

తెలుగులో టాలెంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తొచ్చేది సాయిపల్లవి. సినిమాల ఎంపికలో చాలా పర్టిక్యులర్‌గా వ్యవహరించే ఆమె పాత్ర నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. అలాగే ఓ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు, ఓ బడా నిర్మాత కలిసి తీయబోయే సినిమా ఆఫర్‌ను తిరస్కరించిందట. Also Read: ఈ ఏడాది మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ స్క్రిప్టుతో రెడీగా ఉన్నారు. అయితే వెంకీ, వరుణ్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకోగా నిర్మించేందుకు ముందుకొచ్చారట. ఈ పాత్రకు సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంతే తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/362DFKl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...