Friday, 23 October 2020

Radhe Shyam: మోషన్ పోస్టర్‌‌తో అన్నట్లుగానే మరోసారి పడేశారు.. ప్రభాస్ అభిమానులకు‌ స్పెషల్ కిక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకను అభిమానుల ముందుంచింది చిత్రయూనిట్. ఈ రోజు (అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో 'రాధేశ్యామ్‌' మోషన్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ బర్త్ డే సర్‌ప్రైజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కోసం ‘రాధేశ్యామ్‌’ యూనిట్ ఈ స్పెషల్ గిఫ్ట్ అందించింది. కేవలం పూజా హెగ్డే, ప్రభాస్ లను చూపిస్తూ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ అలరించనుందని ఈ మోషన్ పోస్టర్ ద్వారా క్లియర్‌గా చెప్పేశారు మేకర్స్. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటిస్తూ ఆయన వింటేజ్ లుక్‌తో ఆకట్టుకున్న మేకర్స్.. తాజాగా ఈ మోషన్ పోస్టర్ ద్వారా మరోసారి ఆకర్షించారు. ''వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం'' అని ముందుగానే ప్రకటించిన యూనిట్ అన్నట్లుగానే అదే చేసి చూపించింది. ఈ వీడియోలో చూపించిన అందమైన సన్నివేశాలు, ప్రభాస్- పూజా అప్పీయరెన్స్ ప్రేక్షకలోకానికి కన్నుల పండగగా మారింది. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. రొమాంటిక్ ప్రేమకథగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ యూనిట్ అంతా‌ ఇటలీలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3meQQhH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...