Wednesday, 7 October 2020

Prabhas: ఇటలీలో అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ఇక ప్రభాస్‌తో రొమాన్స్

హీరోయిన్ ఇటలీలో అడుగుపెట్టారు. ‘రాధే శ్యామ్’ షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతున్నారు. ప్రభాస్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. పూజ ఇటలీ వెళ్లిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ‘‘హలో ఇటలీ’’ అని క్యాప్షన్ పెట్టి తాము షూటింగ్ చేయబోయే అందమైన ఇళ్లను వీడియోలో చూపించారు. కాగా, ‘రాధే శ్యామ్’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఇప్పటికే ఇటలీ వెళ్లారు. ఇటలీ వెళ్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన కెమెరా కంటికి చిక్కారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో షూటింగ్ చేశారు. అక్కడ కూడా ప్రభాస్, పూజా హెగ్డేలపై సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్ తరవాత ఇటలీలో షూటింగ్ షురూ చేశారు. లాక్‌డౌన్ తరవాత ప్రభాస్ కెమెరా ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. పూజా హెగ్డే మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్కినేని అఖిల్‌తో కలిసి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న పూజా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్‌ను పూర్తిచేయడానికి ఇటలీ వెళ్లారు. ‘రాధే శ్యామ్’ పాన్-ఇండియా ఫిలింగా తెరకెక్కుతోంది. తెలుగ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. మిగిలిన భాషల్లోకి అనువాదం చేస్తారు. ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, మురళీశర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 1970ల్లో యూరప్‌లో జరిగిన ఒక రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్‌ను ఇప్పటి వరకు హైదరాబాద్, జార్జియాలో జరిపారు. ఇప్పుడు ఇటలీలో చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GCkpKX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...