Wednesday, 21 October 2020

Parasuram:‘సర్కారు వాటి పాట’ షూటింగ్‌కు బ్రేక్ .. టెన్షన్లో డైరెక్టర్!

‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్‌బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘’. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దీనికి దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ నవంబర్ నుంచి మొదలు పెట్టేందుకు యూనిట్ సిద్ధమైంది. కథ రీత్యా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు పరశురామ్ కొద్దిరోజుల ముందే అక్కడికి వెళ్లి అక్కడ లొకేషన్ల వేట మొదలుపెట్టాడు. ఇప్పుడు షూటింగ్ కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా ‘సర్కారు వారి పాట’ యూనిట్ సభ్యులకు వీసా సమస్య వచ్చి పడిందట. Also Read: దీని కారణంగా మరో రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో మహేశ్‌బాబు ఈ సినిమాను పక్కన పెట్టి త్రివిక్రమ్‌ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే పరశురామ్‌కి భారీ దెబ్బ పడినట్లే. గీతా గోవిందంతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్ నాగచైతన్యతో సినిమా తెరకెక్కేందుకు సిద్ధమవుతున్న సమయంలో మహేశ్‌బాబు ఆఫర్ ఇవ్వడంతో ఆ సినిమాను వదులుకున్నాడు. Also Read: ఇప్పుడు వీసా సమస్యలతో మహేశ్‌‌బాబు సినిమాకు బ్రేక్ పడటంతో పరశురామ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఇప్పుడు నాగచైతన్య వద్దకు వెళ్దామంటే ఆయన ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ‘లవ్‌స్టోరీ’తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘థాంక్యూ’ సినిమాకు కమిట్ అయ్యాడు. దీంతో పాటు తెలుగు హీరోలందరూ ప్రస్తుతం వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండంటంతో పరశురామ్‌ ఆందోళన చెందుతున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31vzFR2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...