కరోనా కారణంగా గత ఆరు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్న యంగ్ హీరో , ఇటీవలే తన పెళ్లి కార్యాన్ని పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్నిరోజులు తన ఇష్టసఖి పల్లవి వర్మతో హాయిగా కాలం గడిపిన ఇతగాడు తాజాగా తన కొత్త సినిమా సెట్స్‌పై వాలిపోయాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న '18 పేజీస్' సినిమా స్టార్ట్ చేసేశాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్ తాలూకు వీడియో షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ రోజే (అక్టోబర్ 20) ప్రారంభమైన ఈ మూవీ షూట్‌లో తెగ సందడి చేస్తూ కనిపించాడు నిఖిల్. హీరోయిన్ సహా యూనిట్ అంతా ఈ వీడియోలో కనిపించారు. ముఖానికి మాస్కులు ధరించి కరోనా పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూట్ నిర్వహిస్తున్నారని వీడియో చూస్తుంటే తెలిసిపోతోంది. ఇది చూసి కొత్త పెళ్లికొడుకు నిఖిల్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. Also Read: పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ పాత్ర ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. నిఖిల్, ఆయన జోడీ అనుపమ పరమేశ్వరన్ తెరపై మ్యాజిక్ చేయనున్నారని, వారి క్యారెక్టర్లు ఆడియెన్స్‌ని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దుతున్నామని చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ అన్నారు. గోపీ సుందర్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుందని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dICbbr
v
No comments:
Post a Comment