Thursday, 1 October 2020

Kajal Aggarwal: బోల్డ్ బ్యూటీగా కాజల్.. అందాల విందుతో హీటెక్కించనున్న చందమామ! క్రేజీ అప్‌డేట్

సౌత్ ఇండియన్ భాషా చిత్రాల్లో స్టార్ హీరోల రేంజ్ క్రెడిట్ కొట్టేసి తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకుంది అగర్వాల్. పలు వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తూ దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ ఇకపై ఆన్‌లైన్ వేదికలపై సత్తా చాటనుందట. అది కూడా అందాల విందు చేస్తూ బోల్డ్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకోనుందని అని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటం, మోడ్రెన్ హీరోయిన్స్ అంతా వెబ్ సిరీస్‌ల బాట పడుతున్న నేపథ్యంలో కాజల్ ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లో కాజల్ నటించనుందని లేటెస్ట్ సమాచారం. డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ వేదికలు యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాయి. ‌ఈ సంస్థలు సొంతంగా కంటెంట్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇలాంటి ఓ స్పెషల్ వెబ్ సిరీస్‌లో అందాల విందు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట కాజల్ అగర్వాల్. Also Read: బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏబీసీ ఛానల్‌తో కలిసి 'క్వాంటికో' అనే వెబ్ సీరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హాట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక. అయితే ఇప్పుడు అదే సిరీస్ ఇండియన్ వెర్షన్‌ను నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందట. ఇందులో ప్రియాంక పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ని ఎంచుకున్నట్లు తాజా సమాచారం. ఇదే నిజమైతే ఇక కాజల్ గ్లామర్ ట్రీట్‌తో ఆన్‌లైన్ వేదికలు హీటెక్కిపోవడం ఖాయమే అంటున్నారు ఆడియన్స్. మరోవైపు వెండితెరపై కాజల్ హవా నడుస్తోంది. సీనియర్, జూనియర్ హీరోలందరికీ పర్ఫెక్ట్ జోడీగా వరుస అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం 'ముంబై సాగా' అనే హిందీ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2' సినిమాలో అలాగే చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీలో నటిస్తోంది. దీంతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఓకే చేసింది ఈ టాలీవుడ్ చందమామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jpfZFj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...