Monday, 19 October 2020

Jr. Ntr: ఎన్టీఆర్‌తో సమంత రొమాన్స్! అమెరికా వెళ్లి.. త్రివిక్రమ్ స్కెచ్ అదిరింది

వచ్చే ఏడాది నందమూరి అభిమానులను మరింత హుషారెత్తించేలా వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న ఆయన ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తదుపరి సినిమాను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ‘అల వైకుంఠపురంలో’ విజయం తన ఖాతాలో వేసుకొని మంచి ఊపులో ఉన్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కోసం పదునైన మాటలతో కూడిన ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన మాటల మాంత్రికుడు చివరకు సమంతను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. Also Read: కాగా సమంతతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఫైనల్ చేశారనే టాక్ నడుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్ ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయం అని సమాచారం. దీంతో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోపై ఇప్పటినుంచే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jg7LON
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...