Saturday, 17 October 2020

HBD Keerthy Suresh: కీర్తి సురేష్‌కి 'రంగ్ దే' టీమ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. న్యూ పోస్టర్ రిలీజ్

వైవిద్యభరితమైన సినిమాలతో తనదంటూ ప్రత్యేక నటన అని నిరూపించుకుంటున్న యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు ఈ రోజు (అక్టోబర్ 17). ఈ సందర్భంగా ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా ఆమె లేటెస్ట్ మూవీ '' టీమ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఆకట్టుకుంటోంది కీర్తి సురేష్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై , కీర్తి సురేష్ జంటగా 'రంగ్ దే' మూవీ తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. Also Read: కరోనా కారణంగా కొన్ని నెలలు విరామం తీసుకున్న అనంతరం చిత్ర షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇటలీలో పాటల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ 'రంగ్ దే' మూవీ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nVIm0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...