'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బబ్లీ బ్యూటీ పూనమ్ బాజ్వా తక్కువ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుగు, బాస్ చిత్రాల్లో నటనతో మెప్పించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాలు చేసి అక్కడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఛాన్సులిచ్చే వారు లేకపోవడంతో ఈ అమ్మడు త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉన్న ఈ అమ్మడు బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు కార్డు వేసే టైమ్ వచ్చేసిందని హింట్ ఇచ్చింది. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్, సోల్ మేట్ సునీల్‌రెడ్డిని సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది పూనమ్. "సునీల్ రెడ్డి, మై రూట్స్, గ్రౌండ్, హ్యండ్సమ్, మంచి మనసున్న నా లైఫ్ మేట్, సోల్‌మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. నీతో ఉండే ప్రతీ క్షణం ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది.. హ్యాపీ బర్త్ డే" అంటూ తన ప్రియుడిపై ఉన్న ఆకాశమంత ప్రేమను బయటపెట్టింది పూనమ్. దీంతో పాటు ప్రియుడితో కలిసి బీచ్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kHzDNE
v
No comments:
Post a Comment