Monday, 5 October 2020

అనుష్కతో విజయ్ దేవరకొండ.. కొత్త దర్శకుడితో క్రేజీ మూవీ!

ఒకరు లేడీ సూపర్ స్టార్, ఇంకొకరు సెన్సేషనల్ స్టార్.. ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్కు ఇవ్వబోతున్నారట శెట్టి, విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఒక ఆసక్తికర సబ్జెక్ట్ కోసం , అనుష్కను మేకర్స్ సంప్రదించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తోన్న అనుష్క.. తాజాగా ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వినిపించింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు మరించ ప్రచారం కల్పించడంలో అనుష్క బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు అనుష్క. ఈ ఇంటరాక్షన్‌లో తన రాబోయే చిత్రాల గురించి స్పందించారు. తాను రెండు సినిమాలను అంగీకరించానని.. త్వరలోనే అధికారిక ప్రకటనలు వస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, అనుష్క ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. చాలా మంది సబ్జెక్ట్ కుదిరిందని.. దీంతో అనుష్క, విజయ్ తాము నటించడానికి అంగీకరించారని వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘ఫైటర్’ ద్వారా విజయ్ దేవరకొండ హిందీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిచేసిన తరవాత అనుష్కతో కలిసి విజయ్ నటిస్తారని అంటున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gu1qlw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...