బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిల్కీ బ్యూటీ త్వరగానే కోలుకున్నారు. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు ఆమే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను డిశ్చార్జ్ అయినప్పటికీ డాక్టర్ల సలహా మేరకు కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని తెలిపింది. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే షూటింగ్‌కు వెళ్తానని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తమన్నా కూడా స్పీడ్‌గానే రికవరీ అయ్యారు. సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు తాను కరోనా బారిన పడినట్లు ఆమె తెలిపారు. గతవారం తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని తమన్నా వెల్లడించారు. తమన్నా ప్రస్తుతం ‘సీటీమార్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నారు. హిందీలో సూపర్‌హిట్ అయిన అంధాదున్ సినిమాను నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో టబు పాత్రకు తమన్నాను తీసుకున్నారు. దీంతో కెరీర్లో తొలిసారి ఈ మిల్కీ బ్యూటీ నెగిటివ్ రోల్ నటించబోతోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cZqVqO
v
No comments:
Post a Comment