Saturday, 3 October 2020

జేమ్స్ బాండ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అప్పటివరకు ఎదురుచూపులే

సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జేమ్స్ బాండ్ 007 యాక్షన్ థ్రిల్స్‌ని థియేటర్లలో చూసి చాలాకాలం అవడంతో ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ తెరకెక్కుతోంది. ఇందులో జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటిస్తున్నారు. ఐదోసారి జేమ్స్ బాండ్‌గా నటించిన డేనియల్ ఇదే తన చివరి బాండ్ సినిమా అని ప్రకటించడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌లో విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అందరినీ నిరాశ పరుస్తూ షాకింగ్ విషయం చెప్పారు నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. జేమ్స్‌ బాండ్ అభిమానులకు ఇది కచ్చితంగా బ్యాడ్‌ న్యూస్‌గానే చెప్పొచ్చు. ‘నో టైమ్ టు డై’ సినిమా వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రిలీజ్ డేట్లు ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి రిలీజ్ వాయిదా వేయడంతో బాండ్ అభిమానులకు నిరాశ తప్పలేదు. ప్రజా ఆరోగ్యం సంక్షోభంలో ఉన్న కారణంగానే సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వస్తోందని, నవంబర్ నుంచి పెండింగ్ షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏప్రిల్‌లో కచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ldox2q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...