Sunday, 18 October 2020

చిరు, పవన్ బాటలోనే డైలాగ్‌ కింగ్... ఆ మూవీ రీమేక్‌‌పై ఆసక్తి!

టాలీవుడ్‌లో ఇప్పుడు రీమేక్‌ల పర్వం కొనసాగుతోంది. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్ హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌ వకీల్ సాబ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు 'అయ్యప్పన్ కోషియమ్' చిత్రం రీమేక్‌లోనూ ఆయన నటించనున్నారని కోలీవుడ్లో టాక్‌ నడుస్తోంది. ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళం, మలయాళంలోని లూసిఫర్‌లను రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ హీరో నితిన్‌ సైతం హిందీ బ్లాక్‌బస్టర్ ‘అంధాధున్’ రీమేక్‌లో నటించనున్నాడు. Also Read: ఇప్పుడు వీరి బాటలోనే డైలాగ్ కింగ్ నడవనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. మలయాళంలో తెరకెక్కి బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు అవార్డులు సైతం సొంతం చేసుకున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా 'ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్ 5.25' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు మోహన్‌ బాబు ఆసక్తిగా ఉన్నారట. మలయాళంలో ఈ చిత్రాన్ని రతీష్‌ బాలకృష్ణన్ పొదువల్‌ తెరకెక్కించారు. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o3EsTr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...