Thursday, 1 October 2020

చనిపోయినా బ్రతికుండాలంటే ఇలా చేయండి.. కళ్లు తెరిపించేలా బ్రహ్మానందం మాటలు

చేయండంటూ కళ్లు తెరిపించే మాటలు చెప్పారు హాస్యబ్రహ్మ . ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా సాక్ష్యం సేవ ఆర్గనైజేషన్‌ చేస్తున్న నేత్రదాన అవగాహన కార్యక్రమంలో భాగమయ్యారు బ్రహ్మానందం. నేత్రదానం చేస్తే మరణించిన తర్వాత కూడా బ్రతికుందామని తెలుపుతూ ఆలోచనలు రేకెత్తించే మాటలు చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. మనిషి శరీరంలో అన్ని అవయవాల్లోకెల్లా కళ్లు చాలా ప్రధానమైనవి. కళ్లతో చూడగలుగుతాం.. కళ్లతో మాట్లాడగలుగుతాం.. కళ్లతో మనలో కలిగే ప్రతి భావాన్ని వ్యక్తీకరించగలం. అనంత సృష్టిలో ఉన్న ప్రతిదానిని కళ్లతో చూసి ఆనందించగల ఓ అద్భుతమైన వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్లు వృధా పోకుండా.. నేత్రదానం చేసినట్లయితే మనం ఇచ్చే రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. Also Read: మనం మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం. మన నేత్రదానం వల్ల అందరూ బాగుంటారు. కొంతైనా మనసుంటే మనం చచ్చిపోయినా బతికుంటాం. కాబట్టి మనసుతో ఆలోచించండి. చనిపోయిన తర్వాత వ్యర్థ పదార్థం లాగా మట్టిలో కలిసిపోవడం కంటే.. మనలో ఉన్న అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎన్నో దానాలు చేస్తుంటాం. ఎన్నో దానాలు చేశామని మనం చెప్పుకుంటూ ఉంటాం. గుండె ఒక్కటి ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. Also Read: కార్నియా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా సాక్ష్యం ఆర్గనైజేషన్‌ వాళ్లు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే 350 విలేజెస్‌లో నేత్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. కావాల్సిన నెట్‌ వర్క్ కూడా వాళ్లకి ఏర్పాటు చేస్తూ ఇంకా ఎంతో అభివృద్ది చేయాలనే ఆలోచన సాక్ష్యం ఆర్గనైజేషన్‌కు రావడం హ్యాట్సాఫ్‌. అలాంటి ఆలోచన కలిగి దాన్ని ప్రాక్టికల్‌గా కార్యరూపంలో పెట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను'' అని బ్రహ్మానందం పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36nP0qb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...