Saturday, 3 October 2020

‘ఉప్పెన’ హీరోయిన్‌కు బంపరాఫర్.. క్రేజీ కాంబోలో ఛాన్స్

తెలుగులో తొలి సినిమా విడుదల కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి శెట్టి. ‘ఉప్పెన’తో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్ముడు టీజర్, ట్రైలర్స్, రెండు వీడియో సాంగ్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి స్క్రీన్ పేరు అద్వైత. అదే పేరుతో కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం పేరుతోనే పరిచయం అవుతోంది. Also Read: లాక్‌డౌన్ కారణంతో ‘ఉప్పెన’ సినిమా విడుదల ఆగిపోయినప్పటికీ కీర్తి శెట్టికి మాత్రం అవకాశాలు తలుపు తడుతున్నాయి. తమ సినిమాల్లో నటించాలంటూ దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చిన అన్ని ఛాన్స్‌లకు ఓకే చెప్పేయకుండా కీర్తి శెట్టి జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ కోవలోనే ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ పార్ట్‌లో ఒకరు, సెకండ్ పార్ట్‌లో ఒకరు, క్లైమక్స్‌లో మరో హీరోయిన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో సాయిపల్లవిని ఓకే చేయగా.. ఇప్పుడు కీర్తి శెట్టి చేరింది. ఈ సినిమా నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తాము తీయబోయే మరో సినిమాకు కూడా కీర్తి శెట్టిని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మొదటి సినిమా రిలీజ్ కాకముందే అవకాశాలు క్యూ కట్టడంతో ఈ క్యూట్ హీరోయిన్ తెగ మురిసిపోతుందట. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33r8JmX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...