Tuesday, 27 October 2020

జోరు మీదున్న మెగా మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!

జయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు . ఇటీవలే 'ప్రతీ రోజూ పండగే' సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ మెగా మేనల్లుడు ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టి మంచి జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో బిజీగా ఉంటూనే దర్శకత్వంలో మరో సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభించారు సాయి తేజ్. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ అట్రాక్టివ్ నేమ్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో అన్ని హంగులతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుండగా.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీకి 'రిపబ్లిక్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ వాయిదా వేస్తూ వచ్చిన చిత్రయూనిట్ అతి త్వరలో సినిమాలు సెట్స్ పైకి తీసుకురానున్నారట. సాయి ధరమ్ తేజ్ గత సినిమాలకు బిన్నంగా, కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించనున్నట్లు సమాచారం. Also Read: భగవాన్, జె.పుల్లారావు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటించనుంది. సీనియర్ అండ్ పవర్‌ఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కనిపించనుందట. సాయితేజ ఐఏయస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించి మెగా కాపౌండ్‌ని ఉర్రూతలూగించనున్నారట. దీంతో షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంతో సందడి చేయడానికి రెడీ అయ్యారు సాయి ధరమ్ తేజ్. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35A1U2h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...