Sunday, 4 October 2020

మగబిడ్డ పుడితేనే గొప్పనా? దేశంలో ఇలాంటి దారుణాలా..? సమాజం తీరుపై అనుష్క శర్మ సీరియస్

దేశంలో పట్టపగలే అత్యాచారాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అలాంటి వాటిని ఖండిస్తూ సీరియస్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ . ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం‌లోని హాథ్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ, క్రీడా సెలబ్రిటీలు సైతం ఈ ఉదంతంపై మండిపడుతున్నారు. దేశమంతా ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి దుర్ఘటనలపై స్పందిస్తూ సీరియస్ అయింది హీరోయిన్ అనుష్క శర్మ. ఇటీవలే గర్భం దాల్చిన అనుష్క శర్మ.. పిల్లాడు పుట్టడమనేది గొప్ప విషయమేమీ కాదని, ఈ ఎంతో మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేసింది. హాథ్రాస్‌ ఘటన చూస్తుంటే ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా? అనే భావన కలుగుతోందంటూ సమాజం తీరుపై ఆవేదన చెందింది. మగబిడ్డ పుడితే మన సమాజం గొప్పగా భావిస్తుంది కానీ నిజానికి అమ్మాయి పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని పేర్కొంది. Also Read: ''పిల్లాడు పుడితేనే అదృష్టం అని భావిస్తున్న తల్లిదండ్రులు చాలా విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. సమాజంలోని అమ్మాయిలను, సమాజాన్ని గౌరవించే విధంగా అబ్బాయిలను పెంచాలి. అప్పుడే తాము గొప్ప అని తల్లిదండ్రులమని భావించాలి. సమాజం బాగుకోసం ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. అబ్బాయి పుట్టగానే గొప్పకాదు.. ఆ అబ్బాయిని సమాజం గౌరవించినప్పుడే తల్లిదండ్రుల గొప్ప'' అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనుష్క శర్మ. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన అనుష్క శర్మ.. ప్రస్తుతం ఓ బిడ్డను తన కడుపులో మోస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇటీవలే విరాట్ అఫీషియల్‌గా ప్రకటించారు. '2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం' అంటూ ఆయన చేసిన కామెంట్ సినీ, క్రీడాభిమానుల్లో సంతోషం నింపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F2q0JK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...