Tuesday, 6 October 2020

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నవనీత్ కౌర్.. భవిష్యత్‌ తరాల కోసం తప్పదన్న ఎంపీ

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సెలబ్రెటీలు, ప్రముఖులు ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ సినీనటి, అమరావతి(మహారాష్ట్ర) లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొద్ది నెలలుగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావాలనుకున్నాను. ఈ ఛాలెంజ్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతోనే నేను కూడా మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్‌లో అందరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33vWx4i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...