టాలీవుడ్ అగ్ర కథానాయిక త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్‌మీడియా ద్వారా ఆమె స్వయంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బ్యాచిలర్ పార్టీలో తన స్నేహితులతో కలిసి కాజల్ సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ నెలాఖరున కాజల్ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్ కిచ్లు సోదరితో పాటు అతి తక్కువ మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ పార్టీలో భాగంగా కాజల్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి.. ‘బ్రైడ్ టు బి’ క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది. కాజల్ పెళ్లి వార్త బయటకు రాగానే ఆమె కాబోయే భర్తతో దిగిన పాత ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఈ చందమామకు టాలీవుడ్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nrWJta
v
No comments:
Post a Comment