తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అలాగే అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని హైదరాబాదులో పేరుతో భారీ స్టూడియో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియోను భారీస్థాయిలో రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ నిర్మాత పెద్దగా తన కొడుకుల భాగస్వామ్యంతో ఈ భారీ స్టూడియో నిర్మించబోతున్నారు. ఈ మేరకు అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో హీరోలు , అల్లు శిరీష్, అల్లు బాబీలతో పాటు అల్లు అరవింద్ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించడం విశేషం. ఈ స్టూడియోకు సంబంధించిన అన్ని వివరాలను అల్లు అరవింద్ అతిత్వరలో ప్రకటించనున్నారు. Also Read: బిజినెస్ రంగంలో అల్లు అరవింద్ స్కెచ్చేశారంటే దానికి తిరుగే ఉండదు. టాలీవుడ్ బడా నిర్మాతగా ఎన్నో విజయాలందుకొని లాభాలు గడించిన ఆయన సినిమా రంగంపై ఉన్న ప్రేమతో ఈ స్టూడియో ప్రారంభిస్తున్నారట. సర్వ హంగులతో మోడ్రన్ సినిమా షూటింగులకు కేరాఫ్ అడ్రస్ అయ్యేలా ఈ స్టూడియో నిర్మించాలని ఆయన పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ స్పీడును అర్థం చేసుకొని ఓటీటీ వేదిక 'ఆహా' ప్రారంభించి సక్సెస్ అయిన ఈ అల్లు ఫ్యామిలీ.. ఇక ఈ స్టూడియోను ఏ రేంజ్‌లో నిర్మిస్తుందో చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lfs28X
v
No comments:
Post a Comment