Tuesday, 27 October 2020

రమ్యకృష్ణ విలనిజం.. మెగా మేనల్లుడు‌ తట్టుకోగలడా?

ఒకప్పుడు అగ్ర హీరలందరి సరసన ఆడిపాటి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిలో శివగామ పాత్రలో కనబరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రల్లో కనిపిస్తున్న రమ్యకృష్ణ ఈ సారి నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మెగా హీరో , దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కబోయే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. Also Read: ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా రమ్యకృష్ణ పోషించే పాత్రపై సోషల్‌మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. గతంలో దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’ సినిమాలో సాయికుమార్ పాత్ర ఎంత హైలెట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కూడా అంతకుమించి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా నెగిటివ్ రోల్‌లో కనిపించిన రమ్యకృష్ణ రజినీకాంత్‌‌‌తో పోటీపడి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఆమె మరోసారి నెగిటివ్ రోల్‌‌లో కనిపిస్తుండటంతో మెగా మేనల్లుడు ఆమె ముందు నిలబడగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో తేజ్ సరసన నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరు గతంలో ‘చిత్రలహరి’లో కలిసి నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31OxGHE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...