Thursday, 8 October 2020

'దేడ్ ధిమాఖ్' పూరి జగన్నాథ్.. అన్నీ కెలికి చూస్తే గానీ మనశ్శాంతి ఉండదంటూ ఓపెన్!!

ఇద్దరు అందాల భామల గ్లామర్ డోస్ దట్టిస్తూ వారి నడుమ హీరో రామ్‌తో స్టెప్పులేపించి ధిమాఖ్ ఖరాబ్ చేసిన డాషింగ్ డైరెక్టర్ తాజాగా '' అంటే ఏంటో వివరిస్తూ ఓపెన్ అయ్యారు. గత కొంతకాలంగా పోడ్ కాస్ట్ ఆడియోలతో పలు అంశాలపై స్పందిస్తున్న ఆయన ఈ సారి 'దేడ్ ధిమాఖ్' అనే సబ్జెక్ట్‌పై వివరణ ఇచ్చారు. లైఫ్ ఎంజాయ్ చేయడం ఎలాగో చెబుతూ మనుషులపై తన అభిప్రాయాలను బయటపెట్టారు. ''రెండ్రోజులుంటాం.. పోతాం. ఈ చిన్న లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కువ ఆలోచించొద్దు. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే చాలు. మనం కోతులం. కుదురుగా ఉండము. అన్నీ కెలికి చూస్తే గానీ మనశ్శాంతి ఉండదు. ఈ కెలకడం వల్ల ఉపయోగం లేదు. సమాధానాల కోసం ప్రయత్నించడం మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆన్సర్స్ ఎప్పుడూ దొరకవు. దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి, ఈ జీవితానికి అర్థం ఏమిటి ఇవన్నీ మనకెందుకు? నువ్వో ఓ పాట పాడితే, మనస్ఫూర్తిగా నవ్వితే ఈ జీవితం అర్థవంతమైనట్టే. Also Read: దూరి దూరి ఎక్కడో లోపల చూసాం.. మనకు న్యూట్రాన్ కనిపించింది. దాని తర్వాత కూడా ఏదో ఉండే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మనకు తెలిసింది ఇది. మనిషికి ఎలా ఉంటుందంటే.. భూమి మొత్తం తవ్వేసి లోపల ఏముందో చూడాలని, గాలిలో ఎగిరి యూనివర్స్ ఎండ్ చూడాలని అనిపిస్తుంటుంది. ఈ కోతిపనులు మనకెందుకు. ఎండ్ ఎప్పుడూ దొరకదు. ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మనకు నాలెడ్జ్ అవసరం లేదు. మనం దేడ్ ధిమాఖ్ అయితే చాలు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరూ ఆ ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే పోతారు. ఇంతవరకూ ఎవ్వడూ ఏ కేసూ పట్టుకోలేదు. భగవద్గీత మొత్తం చదివితే చివరి పేజీలో ఒక విషయం రాశారు.. `అజ్ఞానమే ఆనందకరమైనది` అని. ఇదే `దేడ్ ధిమాక్`. తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీలయ్యేవాళ్లే జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పిన పూరి జగన్నాథ్ చివర్లో 'మావా ఎక్ పెగ్‌లా.. అరె మావా ఎక్ పెగ్‌లా..' అంటూ ముగించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34vU890
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...