Tuesday, 27 October 2020

‘వేదాళం’ రీమేక్: చెల్లెల్ని ఖరారు చేసిన చిరంజీవి!

మెగాస్టార్ హీరోగా తెరకెక్కనున్న ‘వేదాళం’ రీమేక్ మూవీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో ఐదేళ్ల తరవాత రీమేక్ చేస్తున్నారు. సుధీర్ఘ విరామం తరవాత డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమా కోసం మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. చిరంజీవి చెల్లెలిగా నటించబోయే నటి కోసం మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తరవాత కీర్తి సురేష్ పేరు మీడియాలో వినిపించింది. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్‌ను చిరంజీవి ఫైనల్ చేశారు. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ అనగానే ఈ సినిమా ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుంది. వెండితెరపై అన్నాచెల్లుళ్లుగా వీరిని చూడటానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూడటం ఖాయం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. కాగా, ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాళం’ రీమేక్ హక్కులను కె.ఎస్.రామారావు ఎప్పుడో కొనుగోలు చేశారు. ఈ సినిమాను చిరంజీవితోనే చేయాలని ఇప్పటి వరకు ఆయన ఆగారని సమాచారం. ఇప్పుడు చిరు మళ్లీ ఫామ్‌లోకి రావడంతో రామారావు ఆయన్ని సంప్రదించారట. రామారావుతో ఒక సినిమా చేస్తానని గతంలో చిరంజీవి మాటివ్వడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ఆయన అంగీకరించారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3otqCKe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...