సినీనటుడు షకలక శంకర్‌ను చేదు అనుభవం ఎదురైంది. కరోనా బాధితుల సహయార్థం విరాళాలు సేకరించడానికి వెళ్లిన ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. బెంజి సర్కిల్‌లో విరాళాలు సేకరిస్తున్న శంకర్‌ను నిలువరించారు. కోవిడ్ 19 నిబంధనల నేపధ్యంలో విరాళాలు సేకరించవద్దని, తమ ఆజ్ఞలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. Also Read: అయితే తనను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారని, అలాంటి వారికి సాయం చేసే ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో కరీంనగర్‌లోనూ ఇలాగే విరాళాలు సేకరించి బాధితులకు అందజేశామని తెలిపారు. విజయవాడలోనూ ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే విరాళాలు సేకరించేందుకు ఇక్కడికి వచ్చానని శంకర్ తెలిపారు. సెప్టెంబర్ నెలలో కరీంనగర్ పట్టణంలో భిక్షాటన చేసిన శంకర్ రూ.90వేలు సమకూర్చారు. దానికి మరో రూ.10వేలు కలిపి లక్ష రూపాయలతో ఏడు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. సినిమాల విషయానికొస్తే ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’ అనే సినిమాను శంకర్ ఇటీవలే మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా, ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ అనే సినిమా కూడా శంకర్ చేస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gtt1n3
v
No comments:
Post a Comment