Friday, 2 October 2020

ఓటీటీలో తుస్సుమంటున్న సినిమాలు.. థియేటర్లు తెరుచుకుంటే కష్టమే

కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రియులకు కాలక్షేపం లేకుండా పోయింది. ఆ లోటు తీర్చేందుకే అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీ సంస్థలు కొన్ని సినిమాలను కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాయి. అయితే ఈ సీజన్లో ఓటీటీల ద్వారా విడుదలైన ఏ సినిమాకు సరైన రెస్పాన్స్ రాకపోవడం షాకింగ్‌కు గురిచేస్తోంది. గత నెలలో విడుదలైన నాని ‘వి’ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్ధం సినిమాలకు కూడా అదే టాక్ వచ్చింది. థియేటర్లు, మల్టీ‌ప్లెక్స్‌లు ఇంకా తెరుచుకోకపోవడంతో వినోదాన్ని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన సినిమాలు మరింత సహనానికి గురి చేస్తున్నాయి. దీంతో ఓటీటీ సినిమాలంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. థియేటర్లలో రిలీజ్ చేస్తే కచ్చితంగా ప్లాప్ అవుతాయన్న సినిమాలను ఓటీటీలకు అమ్మేసి నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ అందించాలన్న ఉత్సాహంతో ఓటీటీ సంస్థలు అడ్డగోలుగా సినిమాలను కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితి వల్లే ఓటీటీల్లో సరైన సినిమాలు రావడం లేదన్న ఆరోపణ ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటి కంటెంటే గనుక ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఓటీటీలపై నమ్మకం పోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అందించే కంటెంట్‌పై ఓటీటీ సంస్థలు పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33lQPlw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...