Thursday, 1 October 2020

గ్రీన్‌ ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాష్‌రాజ్.. కేసీఆర్‌పై ప్రశంసలు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన కార్యక్రమం అద్భుతంగా సాగిపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులందరూ పాల్గొంటూ మొక్కలు నాటేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన విలక్షణ నటుడు .. గురువారం షాద్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. Also Read: ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ... తనికెళ్ల భరణి ఎప్పుడూ మంచి ఛాలెంజ్‌లు తీసుకొని నాకు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఎంతో ఇష్టమైన గ్రీన్ ఛాలెంజ్‌ను నాకు ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరేళ్లలో హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చారు. దీనికి కారణం ఆయనకున్న పది సంవత్సరాలు విజన్. కేసీఆర్, సంతోష్‌కుమార్‌లకు మట్టితో అవినాభావ సంబంధం ఉంది. ఆ కారణంగానే మొక్కలు పెంచే బాధ్యతలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుంది. దీనివల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి’ అని పేర్కొన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అందరిచేత మొక్కలు నాటిస్తూ పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రకాష్‌రాజ్ తెలిపారు. ఈ ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. మలయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అభిమానులు కూడా ఈ ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటాలని ప్రకాష్‌రాజ్ పిలుపునిచ్చారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n7Lzd2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...