సీనియర్ హీరో నందమూరి నటసింహం హీరోగా మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందుతున్న (వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. లాక్‌డౌన్ ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ కరోనా కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్‌కై అనుమతులు వచ్చిన నేపథ్యంలో రెట్టింపు జోష్‌లో రంగంలోకి దిగుతున్నారట బాలయ్యబాబు. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అక్టోబర్ 29 నుంచి షురూ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ''సింహ, లెజెండ్'' సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ నేపథ్యంలోనే BB3 అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సక్సెస్‌ఫుల్ జోడీ. ఈ మేరకు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ఫినిష్ చేసిన బోయపాటి.. అక్టోబర్ 29 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభించబోతున్నారట. ఇకపై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని బలంగా డిసైడ్ అయ్యారట బోయపాటి. దీనికి బాలయ్యబాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. Also Read: ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ను హీరోయిన్‌గా కన్ఫర్మ్ ఛేహారాని టాక్. మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్ లోనే ఆమెను కూడా సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారని తెలిసింది. ఇప్పటికే విడుదలైన BB 3 ఫస్ట్ రోర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. మరోవైపు ఈ సినిమాకు ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారననే టాక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34uCQKw
v
No comments:
Post a Comment