బాబోయ్.. ఘోర తప్పిదం. గూగుల్ తల్లి ఇచ్చిన షాక్‌తో ఇటు ఫ్యాన్స్, అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఈ ప్రపంచాన్ని కుగ్రామం చేసేసింది. ఎప్పుడు, ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ తల్లిని అడిగితే క్షణాల్లో అందుబాటులో ఉంచుతోంది. మొబైల్స్ ఫోన్ వాడకం పెరిగాక ప్రతి విషయంలోనూ గూగుల్ పైనే ఆధార పడుతున్నారు జనం. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ నుంచి వస్తున్న తప్పుడు సమాచారం జనాన్ని అయోమయంలో పడేస్తోంది. తాజాగా అనుష్క శర్మ విషయంలో అదే జరిగింది. అఫ్ఘనిస్థాన్ క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న భార్య ఎవరంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు వస్తోంది. దీంతో ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి చూస్తున్నారు నెటిజన్లు. ఎన్నిసార్లు చూసినా అదే సమాచారం రావడంతో బిత్తరపోవడమే వాళ్ళ వంతైంది. కోహ్లీ భార్యను ఇలా రషీద్ ఖాన్ భార్య అని చూపించడం ఘోర తప్పిదం అంటున్నారు జనం. కొందరు కోహ్లీ ఫ్యాన్స్ అయితే గూగుల్ తల్లిపై ఫైర్ అవుతున్నారు. గూగుల్ ఇలా చూపించడానికి కారణమిదే అని తెలుస్తోంది. ఓసారి రషీద్‌ఖాన్ అభిమానులతో సోషల్ మీడియాలో ఆన్‌లైన్ చాట్ చేస్తూ.. మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనుష్క శర్మ, ప్రీతిజింతా అని సమాధానం చెప్పాడు. దీంతో వెబ్‌సైట్స్ అన్నీ క్రికెటర్ రషీద్ ఖాన్ మన అనుష్క శర్మకు పెద్ద అభిమాని అంటూ వార్తలు రాశాయి. ఆ కారణంగానే కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో ఇప్పుడు రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు వస్తోందని టెక్ విశ్లేషకులు అంటున్నారు. Also Read: అనుష్క శర్మ విషయానికొస్తే.. హీరోయిన్‌గా బాలీవుడ్ తెరపై హంగామా చేస్తూనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడింది. ఇటీవలే ఆమె గర్భవతి అయ్యింది కూడా. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ ఇటీవలే విరాట్ ప్రకటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Y9XZ6
v
No comments:
Post a Comment