Monday, 26 October 2020

సమంతకు కోటి 30 లక్షలు.. ఫీలింగ్స్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అక్కినేని కోడలా మజాకా!!

స్టార్ హీరోయిన్ సమంత.. కేవలం సినిమాలే కాదు మరెన్నో విషయాల్లో ఆమె యాక్టివ్‌నెస్ చూస్తూనే ఉన్నాం. నాగ చైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట్లో అడుగుపెట్టాక ఈ అమ్మడి జోష్ మరింత పెరిగింది. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు రంగాల్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అడుగులేయడంలో రూటే సపరేటు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండటం, ఆసక్తికరమైన ఎన్నో విషయాలను పంచుకోవడం సమంత హాబీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఫాలోయింగ్ చూస్తే ఎవ్వరైనా సరే.. అక్కినేని కోడలా మజాకా! అనాల్సిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే సమంత తన ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది. ఫాలోయింగ్ పరంగా తన తోటి స్టార్ హీరోయిన్స్ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. ఇప్పటివరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్ల (కోటి 30 లక్షలు) దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత. Also Read: ''13 మిలియన్స్.. నా మనసు దోచుకున్నారు.. ఫాలోవర్స్ అందరికీ హగ్స్ అండ్ కిసెస్'' అంటూ తన అభిమానులను హుషారెత్తించే పోస్ట్ పెట్టింది సామ్. ఇది చూసి ''కంగ్రాట్స్ మేడం, యూ ఆర్ ఓన్లీ బిగ్గెస్ట్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్, బ్యూటిఫుల్, గుడ్ న్యూస్'' అని పేర్కొంటూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఇక ఈ పోస్ట్‌తో పాటు సామ్ షేర్ చేసిన తన గ్లామర్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు మామ నాగార్జున స్థానాన్ని భర్తీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది సమంత. 'బిగ్‌బాస్ 4' హోస్ట్‌గా చేసి ఒక్క ఎపిసోడ్ తోనే ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది సామ్. అతి త్వరలో సమంత నటించిన 'ఫ్యామిలీమెన్ 2' వెబ్ సిరీస్ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35DJYUe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...